- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ షర్మిల అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి పైన సూటిగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిరోద్యుగుల సమస్యలను పరిష్కారించడంలోకూడా వైసీపీ వైఫల్యం చెందిందని చూపిస్తూ పలు భహిరంగ సభల్లో వైఎస్ షర్మిల ప్రస్తావించడం జరిగింది. అయితే నిరుద్యోగుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పీసందించలేదు.
ఈ నేపథ్యంలో ఈ రోజు చలో సెక్రటేరియట్ కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుండే పోలీసుల ఆంక్షలు ప్రభుత్వ పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో నిన్న రాత్రే గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ షర్మిల చేరుకున్నారు. అయితే అక్కడనుండి ఆమె అబ్బాపురం వెళ్ళవలసి ఉండగా పోలీసులు ఆమె కాన్వాయ్ ని అడ్డుకోవడంతో విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి చేరుకొని అక్కడే ఉన్నారు.
ఇక ఆమెకు అండగా CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పార్టీ అఆఫీసు లోనే నిద్ర చేశారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా సెక్రటేరియట్ కు బయలు దేరుతామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు వందలాది మంది పోలీసులు బలగాలు ఆంధ్ర రత్న భవన్ దగ్గర మోహరించాయి. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేసారు. ఎవరైనా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నాయకులను కార్యాలయం లోపలి తీసుకు వెళ్లేందుకు వచ్చిన CWC సభ్యులు గిడుగు రుద్రరాజుని, అలానే వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More..
Ration Card: తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్.. సమ్మర్ స్పెషల్ అండీ!