కడపలో ఘోర ఓటమి.. తొలిసారి స్పందించిన వైఎస్ షర్మిల

by srinivas |
కడపలో ఘోర ఓటమి.. తొలిసారి స్పందించిన వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా పోటీ చేశారు. అయితే అందరూ గెలుస్తారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆమె ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డికే ప్రజలు పట్టంకట్టారు. వైఎస్ వివేకా హత్య, కేసుల నేపథ్యంలో ఈజీగా గెలుస్తామని వైఎస్ షర్మిల దీమాగా ఉన్న ఆమెకు ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ షర్మిల ఘోరంగా ఓటమి చెందారు. ఆ సమయంలో ప్రజల తీర్పును వైఎస్ షర్మిల స్వాగతించారు. ఓటమిపై ఎక్కడా మాట్లాడలేదు. ఎట్టకేలకు ఆమె తాజాగా స్పందించారు. తాను గెలవకపోవడానికి కారణం టైమ్ అని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను కడపలో 14 రోజులు మాత్రమే తిరిగానని, మిగిలిన సమయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశానని చెప్పారు. కడప పార్లమెంట్ పరిధి చాలా రూరల్ ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుందన్న విషయమే ప్రజలకు తెలియలేదని, అందువల్లే తాను ఓడిపోయానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.



Next Story