Big Breaking: వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్

by srinivas |   ( Updated:2023-04-16 15:26:54.0  )
Big Breaking: వైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల పూర్తైన అనంతరం సీబీఐ మెజిస్ట్రేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపర్చారు.దీంతో ఇరువాదనల విన్న కోర్టు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కాసేపట్లో భాస్కర్ రెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఎలా జరిగిదంటే..!

కాగా దివంగత సీఎం వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ మరింత వేగవంతం చేసింది. మరో 15 రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈకేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

తాజాగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు సంబంధించి మెమోను సతీమణి లక్ష్మికి పి.జనార్థన్ రెడ్డికి అందజేశారు. భాస్కర్ రెడ్డిపై 130బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లో విచారణ అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి వైఎస్ భాస్కర్ రెడ్డిని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ మెజిస్ట్రేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపర్చారు.

ఇవి కూడా చదవండి : వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

Advertisement

Next Story