Narsipatnam: నర్సీపట్నంలో యువకుడి దారుణహత్య

by Rani Yarlagadda |
Narsipatnam: నర్సీపట్నంలో యువకుడి దారుణహత్య
X

దిశ, వెబ్ డెస్క్: నర్సీపట్నం (Narsipatnam)లో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఎస్ నాగేశ్వరరావు అనే యువకుడిని కత్తులతో పొడిచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అప్పటికే యువకుడు మృతి చెందాడు. ఈ హత్య చేసిన ఓ రౌడీ షీటర్ అని అనుమానిస్తున్నారు. అతనికి మరో ఇద్దరు సహాయం చేశారని భావిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడిని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed