Nara Lokesh : లోకేశ్ దీక్షలో వైసీపీ రెబల్ ఎంపీ ప్రత్యక్షం

by Seetharam |   ( Updated:2023-10-02 08:28:31.0  )
Nara Lokesh : లోకేశ్ దీక్షలో వైసీపీ రెబల్ ఎంపీ ప్రత్యక్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. లోకేశ్ చేపట్టిన దీక్షకు పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనమేడల రవీంద్ర కుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం హాజరయ్యారు. నారా లోకేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి సైతం లోకేశ్ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు. అలాగే లోకేశ్ దీక్షలో పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి గాంధీ జయంతి రోజున నిరాహార దీక్షకు దిగారు. సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో దీక్షకు పూనుకున్నారు.

Advertisement

Next Story