వైసీపీకి ఎంపీ పిల్లి సుభాశ్ గుడ్ బై.. ప్రచారంపై స్ట్రాంగ్ రియాక్షన్

by srinivas |   ( Updated:2024-08-29 10:32:26.0  )
వైసీపీకి ఎంపీ పిల్లి సుభాశ్ గుడ్ బై.. ప్రచారంపై స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. విజయసాయిరెడ్డితో సహా మిగిలిన ఎంపీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్ల సుభాశ్ చంద్రబోస్ స్పందించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకూ వైసీపీలోనే ఉంటానని తెలిపారు. తాను వైసీపీ వీడటం లేదని, అదంతా దుష్ప్రచారమన్నారు. అవాస్తవాలను ఎవరూ నమ్మొద్దని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనని ఇప్పటికే చాలా సార్లు చెప్పానని సుభాశ్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి వెనుపోటు పొడవనని చెప్పారు. చాలా సందర్భాల్లో పార్టీ తనను ఆదరించిందని, వైఎస్ జగన్ కు అన్ని విధాలుగా ఉండగా ఉంటానని వైసీపీ రాజ్యసభ్యుడు పిల్లి సుభాశ్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

కాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాస్ చంద్రబోస్ జగన్ తండ్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ వెంట నడిచారు. దాంతో ఆయనకు వైఎస్ జగన్ కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిల్లి సుభాశ్ చంద్రబోస్ రామచంద్రాపురం నియోజకవర్గం సీటును ఆశించారు. అయితే అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణుకే ఆ సీటును జగన్ కేటాయించారు. ఆ సమయంలో పిల్లి సుభాశ్ చంద్రబోస్ తో పాటు ఆయన కుమారుడు పిల్లి సూర్య ప్రకాశ్ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారని, జనసేనలో చేరుబోతున్నారని ప్రచారం జరిగింది.

అయితే పిల్లి సుభాశ్ చంద్రబోశ్‌ను వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. దాంతో ఆ వివాదం ముగిసింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ పార్టీ కార్యక్రమాలు జరగలేదు. దీంతో నిరాశలో ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీ రాజ్యసభ్యులందరూ బీజేపీ, టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed