- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీ ఫ్లెక్సీల్లో వైసీపీ ఎంపీ.. సైకిల్ ఎక్కినట్లేనా..?
దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రర్యటనలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గల్లా జయదేవ్ ఇంట్లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నరసారావుపేటా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అలానే టీడీపీ మాజీ మంత్రి నారాయణ ఇరువురు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
ఇక చంద్రబాబును కలిసేందుకు మాజీ మంత్రి నారాయణ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఒకే కార్ లో కలిసి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అలానే టీడీపీ ఫ్లెక్సీల్లో శ్రీకృష్ణదేవరాయలు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు మాజీ మంత్రి నారాయణతో కలిసి రావడం, టీడీపీ హోర్డింగ్ లో శ్రీకృష్ణదేవరాయలు ఫోటో ఉండడం యాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది.
ఇక గతంలో వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ గూటికి చేరనున్నారు అనే వార్తలు వినిపించాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఆ వార్తలు వాస్తవమే అనే సందేహం కలుగుతోంది అని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.