‘జగన్‌తోనే నా ప్రయాణం.. పార్టీని వీడడం లేదు’.. స్పష్టం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ

by Jakkula Mamatha |
‘జగన్‌తోనే నా ప్రయాణం.. పార్టీని వీడడం లేదు’.. స్పష్టం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల పలువురు వైసీపీ నేతలు(YCP Leaders) పార్టీని వీడి అధికార టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) పండుల రవీంద్రబాబు కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎమ్మెల్సీ రవీంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు (MLC Pandila Ravindra Babu) తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలిపారు. ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దు అని సూచించారు. ఈ క్రమంలో ‘నాకు వైసీపీని వీడాల్సిన అవసరం లేదు’ అని ఎమ్మెల్సీ రవీంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తోనే నా ప్రయాణం అని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మాజీ సీఎం జగన్(YS Jagan) తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి(State Development) చేశారని వ్యాఖ్యానించారు. అన్ని కులాలతో సమానంగా దళితులకు పెద్ద పీట వేశారు. అలాంటి వ్యక్తిని, ఆ పార్టీ విలువలను వదిలి వెళ్లే ఆలోచన నాకు లేదు అని ఎమ్మెల్సీ రవీంద్రబాబు వెల్లడించారు.

Advertisement

Next Story