- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral News: ఓట్లు అడగడానికి వచ్చిన వైసీపీ నేతలు.. తరిమికొట్టిన ప్రజలు
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు పేదల కోసమే వైసీపీ అని సీఎం జగన్మోహన్ రెడ్డి వేదికలు దద్దరిల్లేలా చెబుతుంటే.. మరో వైపు ప్రజలు, ఓట్లు అడగడానికి వచ్చిన వైసీపీ నేతలను కడిగిపారేస్తున్నారు. మీరు మాకేం చేశారు.. మేము ఎలా బ్రతకాలి అని నేతలను నిలదీస్తున్నారు.
ఈ ఘటన కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రానున్న ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్న వంగా గీత ఓట్లు అడగడానికి పిఠాపురం వెళ్లారు. అయితే ఆమెకు అక్కడ ఘోర అవమానం జరిగింది. మీరు, మీ ప్రభుత్వం మాకేం చేసింది.. ఇల్లు వాకిలి కూడా ఇవ్వలేదు. మేము ఎలా బ్రతకాలి అంటూ ఊరి పొలిమేరలోనే గీతను ఆ ఊరి ప్రజలు నిలదీశారు.
కాగా ఈ ఘటనపై టీడీపీ X వేదికగా స్పందించింది. వైసీపీ అభ్యర్థులు సిద్ధమా అంటూ ఓట్లు అడగటానికి వెళ్తే ప్రజలు వారితో మాటల యుద్ధమే చేస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీత గారిని ప్రజలు ఎలా నిలదీస్తున్నారో చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.