- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీలోకి వైసీపీ నేత గిరిధర్ రెడ్డి.. అన్న కోసమే(నా) ?
దిశ, నెల్లూరు: జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల గెలుపుతో టీడీపీ క్యాడర్‌లో మరింత జోష్ పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే అసంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి రావచ్చని తెలుగు తమ్ముళ్లు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో క్యాడర్‌కు మరింత జోష్‌ను పెంచుతూ నెల్లూరు వైసీపీలో కీలక నేత ఎమ్మెల్యే గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. దీంతో నెల్లూరు టీడీపీ క్యాడర్‌లో సంబరాలు మొదలయ్యాయి. గిరిధర్ రెడ్డి తమ పార్టీలో చేరితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బలం పెరుగుతుందని టీడీపీ భావిస్తోంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడడంతోనే గిరిధర్ రెడ్డి కూడా అన్నతోపాటు పార్టీ నుంచి భయటకు వచ్చారు.
శ్రీధర్ రెడ్డికి చాన్స్ ఇవ్వని టీడీపీ
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడిన టీడీపీ.. శ్రీధర్ రెడ్డికి మాత్రం చాన్స్ ఇవ్వడం లేదు. అందుకు కారణం గతంలో కోటంరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ నేతపై దాడులు చేయడం, వారిపై అక్రమ కేసులు బనాయించారనే ఆయనను పార్టీలోకి ఆహ్వానించలేదని సమాచారం. మరి కొందరి వాదన మాత్రం మరోలా ఉంది. చంద్రబాబు ఆహ్వానిస్తే టీడీపీలో చేరుతానని కోటంరెడ్డి బహిరంగంగానే ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీలోని ముఖ్యనేతలు ఆయన చేరికను అడ్డుకుటున్నారని చెప్పుకుంటున్నారు.
పథకం ప్రకారమే(నా) ?
శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తమకు ప్రాధాన్యత తగ్గుతుందని వారు ఆందోళనకు గురవుతున్నారని సమాచారం. శ్రీధర్ రెడ్డిని ఎలాగైనా టీడీపీలోకి రాకుండా అడ్డుకునేందుకు కొందరు నేతలు.. వారి అనుచరులతో వసరుసగా ప్రెస్ మీట్లు పెట్టి కోటంరెడ్డిని విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలపై శ్రీధర్ రెడ్డి దాడిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇలా పథకం ప్రకారం పార్టీలో చేరకుండా కోటంరెడ్డిపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో శ్రీధర్ రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని కొందరు టీడీపీ నేతలు ఎస్సీకి ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
వ్యూహంతోనే గిరిధర్ రెడ్డి ఎంట్రీ
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎంత వేచి చూసినా టీడీపీ నుంచి ఆహ్వానం అందకపోవడంతో గిరిధర్ రెడ్డికి ముందుగా పసుపు కండువా కప్పిస్తున్నారు. అనంతరం తమ్ముడు ద్వారా అక్కడ పరిస్థితులు చక్కబడ్డాక ఎన్నికల సమయానికి శ్రీధర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
గిరిధర్ రెడ్డి టీడీపీలో అన్నపై వ్యతిరేకంగా ఉన్నవారిని అనుకూలంగా మారుస్తాడనే నమ్మకంతో ఉన్నామని శ్రీధర్ రెడ్డి అనుచరులు అంటున్నారు. మరికొందరి వాదన మాత్రం కోటంరెడ్డిని ఇప్పటికిప్పుడే పార్టీలోకి రావద్దని, కొంత కాలం వైసీపీలోనే రెబెల్ ఎమ్మెల్యేగా కొనసాగాలని చంద్రబాబు సూచించినట్లు చెప్పుకుంటున్నారు. కోటంరెడ్డి కంటే ముందుగా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లే జరిగిందన్న టాక్ కూడా వినిపిస్తోంది..
- రేపే గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిక
నేడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. రేపు రెండు వందల కార్లతో ర్యాలీగా వెళ్లీ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కోటంరెడ్డి గిరధర్ రెడ్డిని తాజాగా వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీధర్ రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Also Read: వైసీపీ ఓడింది ఇందుకేనా..?