- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:ఏపీలో హింసపై ఎగ్జిబిషన్..మీడియాకు వైసీపీ ప్రత్యేక ఆహ్వానం!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వైసీపీ కార్యకర్తలపై దాడులు ఈ ఘటనలపై వైసీపీ మండిపడింది. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధర్నా చేయనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద రేపు ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిని కవర్ చేయడానికి మీడియాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలు, రాష్ట్రంలో శాంతి భద్రతలను హైలెట్ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వైసీపీ పేర్కొంది. కాగా ఇప్పటికే వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశానికి వైసీపీ శ్రేణులు నల్ల కండువాలతో వచ్చిన విషయం తెలిసిందే.