- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YCP: కొత్త ఆలోచనలు లేని దిగజారుడు బడ్జెట్.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: దిగజారుడు బడ్జెట్(Poor Budget) లో కొత్త ఆలోచనలు ఏమి లేవని(No New Ideas), డబుల్ ఇంజిన్ సర్కార్(Double Engine Government) లో రెండు ఇంజన్ లు వ్యతిరేక దిశ(Opposite Directions)లో కదులుతున్నాయని మాజీఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి(YCP Leader Vijayasai Reddy) అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ బడ్జెట్ టీడీపీ తప్పుడు వాదనలను మాత్రమే చూపుతోందని వ్యాఖ్యానించారు. అలాగే తాను రుణాలకు వ్యతిరేకమని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 2023-24లో రూ.5011 కోట్ల నుండి 2024-25లో రూ.18,249 కోట్లకు పెరిగినట్లు బడ్జెట్ పత్రాలు చూపిస్తున్నాయని తెలిపారు. మొత్తం పబ్లిక్ రుణాలు కూడా రూ.76,209 కోట్ల నుండి రూ.91,433 కోట్లకు పెరిగాయని సూచించారు. ఈ టీడీపీ సర్కార్(TDP Government) పనులు చేయడంలో కాదు.. అప్పులు(loans) తీసుకోవడంలో వేగంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం(Central Government) నుండి నిధుల సహాయం రూ.34,701 కోట్ల నుండి రూ.30,333 కోట్లకు పడిపోయాయని, ఈ సంవత్సరం రివైస్డ్ ఎస్టిమేషన్ రూ.20,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని తాను ఖచ్చితంగా అంచనా వేసినట్లు అనుకుంటున్నానని అన్నారు. బడ్జెట్ చూస్తే అప్పులు పెరిగి(Debt Has Gone Up).. గ్రాంట్లు తగ్గుతున్నాయని(Grants Are Going Down), ఇది ఖచ్చితంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అయితే రెండు ఇంజన్లు వ్యతిరేక దిశలో కదులుతున్నాయని, కాబట్టి నికర ప్రభావం సున్నా అని చెప్పారు. ఇక మూలధన వ్యయం గురించి అంత ప్రచారం చేసి, దాని కోసం కేటాయించిన బడ్జెట్ లో కేవలం రూ.31,061 కోట్ల నుండి రూ. 32,712 కోట్లకు మాత్రమే పెంచారని తెలిపారు. దీంతో ఆర్థిక లోటు కూడా రూ.62,719 కోట్ల నుండి రూ.68,742 కోట్లకు పెరుగుతుందని చెబుతూ.. బడ్జెట్ కొత్త ఆలోచనలు ఏమి లేకుండా దిగజారుడుగా ఉందని విజయసాయి రెడ్డి వెల్లడించారు.