- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వైసీపీలో మొదలైన ప్రక్షాళన.. ఉమ్మడి కడప జిల్లా నుంచే నియామకాలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్ పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి కడప జిల్లా నుంచే నియమకాలు చేపట్టారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమర్ నాథ్, కడప జడ్పీచైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డిని అధినేత జగన్ నియమించారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలంతా డీలా పడ్డారు. కొద్దిమంది మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ఒంటి చేతిపై లేచిన నాయకులంతా ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు. మరికొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. దీంతో పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని అధినేత నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీ కీలక నేతలకు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. తొలుత ఉమ్మడి కడప జిల్లా నుంచి కొత్త అధ్యక్షులను నియమించారు.