- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీకాళహస్తిలో పెట్రోల్ పోసుకొని మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రబాద్ ముత్యాలమ్మ ఆలయం ద్వంసం తర్వాత వెలుగులోకి వచ్చిన మహిళా అఘోరి(Woman Aghori) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిత్యం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించుకుంటున్న ఆమె.. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని పలుమార్లు మీడియాతో చెప్పుకొచ్చారు. దీంతో ఆమెను తెలంగాణ నుంచి మహారాష్ట్ర కు తరలించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆలయాలను సందర్శిస్తున్న మహిళా అఘోరి.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి(Srikalahasti)కి చేరుకొని అక్కడ హల్ చల్ సృష్టించారు. ఆమెను ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడంతో.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం(suicide attempt) చేసుకుంది. దీంతో అక్కడే ఉన్న స్థానిక మహిళలు, ఇతర అధికారులు అమెను అడ్డుకున్నాను. అనంతరం స్థానిక మహిళలు అఘోరి పై బిందెలతో నీళ్లు పోశారు. అఘోరి ఆత్మాయత్నం ప్రయత్నంతో అక్కడున్నవారు ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది.