ఆపరేషన్‌ కోసం దాచిన డబ్బులతో.. ఆన్‌లైన్ గేమ్ ఆడి.. ఆత్మహత్య

by Seetharam |   ( Updated:2023-06-06 09:10:40.0  )
ఆపరేషన్‌ కోసం దాచిన డబ్బులతో.. ఆన్‌లైన్ గేమ్ ఆడి.. ఆత్మహత్య
X

దిశ,వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ గేమ్ చాలెంజ్ కారణంగా కొందరు బలితీసుకుంటే.. మరి కొందరు ఆన్‌లైన్ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో ఇబ్బందులకు గురై.. బదులు చెప్పలేక బలవుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. తాతా ఆపరేషన్ కోసం దాచిన రూ. 78 వేలు పొగుట్టుకున్న సాద్విక్ ఇంట్లో తెలిస్తే మందలిస్తారని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాత ఆపరేషన్ కోసం తన మేనత్త డబ్బులు పంపడంతో ఆ కుర్రాడు వాటిని ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. దీంతో మొఖం చూపించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement

Next Story