- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అల్లూరి జిల్లాలో గాలి వాన బీభత్సం
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ఈదురుగాలులు కూడా బలంగా వీచాయి. చాలా చోట్ల కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు గాలికి ఎగిరిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫాన్ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు రేమాల్‌గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఈ నెల 27న తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం స్వల్పంగా ఉంటుందని, కానీ ప్రజలు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.