- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ సునీత ఎన్నికల బరిలో దిగనున్నారా..? పోటీ ఎక్కడ నుండి..?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే శత్రువులు ఎక్కడో ఉండరు కూతుర్ల రూపంలో చెల్లిల్ల రూపంలో మరువేషం వేసుకుని ఇంట్లోనే తిరుగుతుంటారు అని అఆ సినిమాలో రావు రమేశ్ అన్నట్టు సీఎం జగన్ కి తన చెల్లిళ్లే శత్రువులగా మారారని ప్రజలు అనుకుంటున్నారు.
వ్యక్తిగత వివాదాల కారణంగా సొంత చెల్లి వైఎస్ షర్మిల దూరమైంది. ఇక తన తండ్రి మరణం వెనుక సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందనే అనుమానంతో సొంత బాబాయి కూతురు వైఎస్ సునీత కూడా జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూస్తోందని సమాచారం. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతులు చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.
ఇక ఆమె ప్రజా సభల్లో ప్రస్తావిస్తూ జగన్ చేసిన అభివృద్ధి గురించి సూటిగా ప్రశ్నిస్తోది. అయితే ఒక్క చెల్లితోనే వేగలేక తలపట్టుకుంటున్న జగన్ కి ఇప్పుడు మరో చెల్లి కూడా తలనొప్పిగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల బరిలో దిగేందుకు వైఎస్ సునీత సిద్ధమైయ్యారని సమాచారం. ఈ నెల 15వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి రోజు తన నిర్ణయాన్ని చెప్పనున్నారని సమాచారం.
అయితే ఆమె ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు అనే అంశంపై అటు రాజకీయవర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అన్న జగన్ కు పోటీగా చెల్లి వైఎస్ షర్మిల కూడా పులివెందుల బరిలో దిగనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు వైఎస్ సునీత ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా జగన్ కు పోటీగా పులివెందుల నుండి పోటీ చేస్తారా..? లేక అవినాష్ రెడ్డికి పోటీగా కడప బరిలో దిగుతారా..? అనేది అందరిలో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
Read More..
పట్టిసీమలో బందోబస్తు పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజి..