డిక్లరేషన్ సాంప్రదాయాన్ని గౌరవించకుండా తిరుమల ఎందుకు వెళ్ళాలి : జగన్ పై చంద్రబాబు ఫైర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-24 06:43:41.0  )
డిక్లరేషన్ సాంప్రదాయాన్ని గౌరవించకుండా తిరుమల ఎందుకు వెళ్ళాలి : జగన్ పై చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల పవిత్రత..భక్తుల మనోభావాలకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ట్విటర్ వేదికగా మండిపడ్డారు.వైఎస్ జగన్ దేవుడిని దర్శించుకోవచ్చని.. అయితే ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? అని చంద్రబాబు నిలదీశారు. ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదన్నారు. డిక్లరేషన్ పై ప్రశ్నిస్తే బూతులు తిట్టారని విమర్శించారు. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు.

హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?... రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రధం కాలిపోతే…. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారని.. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుంది అని అడిగారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని,. అందుకే బాధపడుతూ చెబుతున్నానని.. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందనేదే మన బాధ అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలని.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయమన్నారు. ఏ మతమైనా సరే.. వేరే వారిని చులకనగా చూడటం కరెక్టు కాదన్నారు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహమని జగన్, వైసీపీ నేతలపై మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed