AP TET Results 2024:ఏపీ టెట్‌ రిజల్ట్స్‌ విడుదల..డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?

by Jakkula Mamatha |
AP TET Results 2024:ఏపీ టెట్‌ రిజల్ట్స్‌ విడుదల..డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు(AP TET) ఫలితాలు విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.67లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేయగా న 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి. మార్చి 14వ తేదీన విడుదల కావాల్సిన ఫలితాలు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాయిదా పడ్డాయి. కాగా టెట్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/CandidateLogin.do చూడవచ్చు.

డీఎస్సీలోనూ టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు జూలై 1వ తేదీన మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 16వేల డీఎస్సీ పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ లోపు రిక్రూట్ చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టుకోవడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

Advertisement

Next Story

Most Viewed