AP News:న్యూ ఇయర్ వేడుకలకు మంత్రి దూరం.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP News:న్యూ ఇయర్ వేడుకలకు మంత్రి దూరం.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపు(జనవరి 1) జరగబోయే నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలకు , పార్టీ శ్రేణులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి ముందుగా ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆడంబరాలకు దూరంగా , ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని, విలువైన సమయాన్ని కోల్పోవడం, అనవసర ఖర్చు ఉండకూడదు వంటి ఆలోచనలతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ కొత్త సంవత్సరం కూడా అందుబాటులో ఉండటం లేదని తెలియజేశారు. ఈ క్రమంలో తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కేకులు, పండ్లు, దండలు, బొకేలు వంటివి తీసుకురావద్దని మంత్రి సూచించారు.

ఈ తరుణంలో ‘‘డబ్బులు దూబరా చేయవద్దని కోరుతున్నాను. వీటికి ఖర్చుపెట్టే సొమ్మును సేవా రూపంలో దివ్యాంగులు, వృద్ధులు, ఆదరణ లేని నిరుపేదలకు అందించాలని కోరుతున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం ద్వారానే నాకు నిజమైన శుభాకాంక్షలు’’ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా , నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు మీరంతా అనవసరపు ఖర్చులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నూతన సంవత్సరం వేడుకలు, పుట్టినరోజుకి నేను దూరంగా ఉంటున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రజా జీవితంలో ఉన్న మనం ఎటువంటి స్థానంలో ఉన్న పదిమందికి సేవ చేయడం ద్వారానే నిజమైన సంతృప్తి ఆనందం. అదే నా ఆశయం. ఈ ఏడాది మంత్రి పదవి వచ్చింది కాబట్టి నియోజకవర్గంలో ఉండి వేడుకలు జరుపుకోవాలని నా అభిమానుల కోరికను మన్నించలేకపోతున్నానని మంత్రి నిమ్మల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story

Most Viewed