AP:జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం వార్నింగ్..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-07 14:12:57.0  )
AP:జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం వార్నింగ్..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం కేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జనసేన శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే సర్కార్‌కు జనసేన శ్రేణులు వెన్నుదన్నుగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం కూడా నిబంధనల అతిక్రమణ కిందికే వస్తుందని, అలాంటి వారిపైనా చర్యలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పిఠాపురంలో జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని ఉండడంపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. కాగా చట్టాలను ఎవరు అతిక్రమించవద్దని జనసేనాని అభిమానులకు, కార్యాకర్తలకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed