- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ పార్టీలో జరిగేదే మా పార్టీలో జరుగుతుంది: ఇన్‌చార్జిల మార్పుపై బొత్స సత్యనారాయణ
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. కుప్పం సిట్‌కే చంద్రబాబు నాయుడుకు గ్యారెంటీ లేదు అని చెప్పుకొచ్చారు. ఓడిపోతాను అనే భయతోనే చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక జోక్ అని మాట్లాడటం టైం వేస్ట్ అని మండిపడ్డారు. చంద్రబాబు గత ఏడాది సీట్లు ఇచ్చిన అందరూ గెలిచారా అని అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీలో ఇన్‌చార్జిల మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ పార్టీలో జరిగే ప్రక్రియ తమ పార్టీలో జరుగుతుందని చెప్పుకొచ్చారు. గెలుపు కోసమే మార్పులు అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వైసీపీ ప్రజలకు అండగా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఓడిపోయాడని ధ్వజమెత్తారు. పెత్తందారులు మోచేతి నీరు చంద్రబాబు నాయుడు తాగారు అని చెప్పుకొచ్చారు. అంచెల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం అని చెప్పాం..అలాగే చేస్తున్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. సామాన్యులకు మందు దొరకకుండానే చేస్తున్నాం అని పబ్లిక్‌లో పరివర్తన తెస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
అంగన్వాడీలు ఆందోళన విరమించాలి
వైసీపీ వచ్చాక అంగన్వాడీలకు పెంచిన జీతం ఎప్పుడు పెంచలేదు అని మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీలు ఆందోళన విరమించాలి...ప్రభుత్వంతో చర్చించాలి అని సూచించారు. చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం తగదు అని అన్నారు. పంట నష్టంపై వర్షం తగ్గాక కదా అంచనా వేసేది అని చెప్పుకొచ్చారు. ఈలోపే పంట నష్టంపై మాట్లాడటం సరైంది కాదు అని చెప్పుకొచ్చారు. రంగు మారిన ధాన్యం కుడా కొనుగోలు చేయమని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని...రైతులు నష్టపోకుండా ఏర్పాట్లు చెయ్యాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.