- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: 6 కేజీల బంగారం తరలింపు.. పది మంది అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారు అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. బిల్లులు చూపకపోవడంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత తర్వగా కేసును ఛేదిస్తామని చెప్పారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. మరోవైపు ఎవరైనా అక్రమంగా బంగారం, గంజాయి, మత్తు పదార్థాలు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.