- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eluru: నూజివీడులో విషాదం.. స్కూలు గోడ కూలి విద్యార్థి దుర్మరణం
దిశ, డైనమిక్ బ్యూరో: ఏలూరు జిల్లా నూజివీడు ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. గోడ కూలి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. నూజివీడు విష్డం ప్రైవేట్ స్కూల్లో నీల మణికంఠ(4) నర్సరీ చదువుతున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికంట టాయిలెట్ కోసం వెళ్లగా మరుగుదొడ్డి వద్ద గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నర్సరీ చదువుతున్న మణికంఠతోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. గోడ కూలడంతో రాళ్ల కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను చికిత్సనిమిత్తం స్థానిక మెమోరియల్ ఆసుపత్రికి యాజమాన్యం తరలించగా... చికిత్స పొందుతూ చిన్నారి మణికంఠ మృతి చెందాడు. ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ శివన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అయితే తల్లిదండ్రులకు మణికంఠ ఒక్కడే కుమారుడు. ఉన్న ఒక్కకుమారుడు మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూజివీడు టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి మణికంఠ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.