Breaking: పేరుపాలెం బీచ్‌లో విషాదం

by srinivas |   ( Updated:2023-03-05 13:50:06.0  )
Breaking: పేరుపాలెం బీచ్‌లో విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ఆదివారం కావడంతో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. సరదాగా సముద్రంలోకి స్నానానికి దిగారు. అయితే ఇద్దరు విద్యార్థులు ఒక్కసారిగా గల్లంతయ్యారు. తోటి విద్యార్థులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలించలేదు. ఓ విద్యార్థి చనిపోయారు. దీంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మరో విద్యార్థి నీటిలో కొట్టుకుపోవడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తోటి విద్యార్థి మృతితో మిగిలిన విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారి స్నేహాన్ని గుర్తు తెచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.

Advertisement

Next Story