- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక సీటు.. ఇద్దరు ఫైట్..ఉండి టీడీపీలో విభేదాలు
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ పాదయాత్ర వేవ్‌లోనూ పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై పోటీ చేసి ఎమ్మెల్యేగా మంతెన రామరాజు గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఉండి టికెట్ టైట్ అవుతోంది. సొంత పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు నుంచి టికెట్ డిమాండ్ పెరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటూ ఆయన చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అటు అధినేత కూడా సుముఖుంగా ఉన్నారని కూడా అంటున్నారు. దీంతో ఉండిలో ఎమ్మెల్యే రామరాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుగా మారింది. ‘పదేళ్లుగా పార్టీ పని కోసం సేవ చేస్తున్నా. ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. పార్టీ ఆదేశాలను పాటించే వ్యక్తిని. ఈసారి ఉండి టికెట్ నాకే ఇస్తారని ఆకాంక్షిస్తున్నా. పార్టీ ఆదేశాలు తూచా తప్పుకుండా పాటిస్తా.’ అని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పేర్కొన్నారు. అయితే అటు సిట్టింగ్‌గా మళ్లీ తానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే రామరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.