Disha Effect: ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

by srinivas |   ( Updated:2023-06-02 14:03:16.0  )
Disha Effect: ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
X

జంగారెడ్డిగూడెం హైస్కూల్ ఘటనలో వరుస సస్పెన్షన్‌లు.

3 నెలల విచారణలో ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

సుమోటాగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్

మరో శాఖలో కూడా సస్పెన్షన్‌లు ఉన్నట్లు సమాచారం

దిశ, ఏలూరు ప్రతినిధి: మార్చి 17న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరగతి గదిలో ఫ్యాన్ రెక్కలు విరగొట్టారంటూ ముగ్గురు విద్యార్థులపై ఉపాధ్యాయులు దాడి చేశారు. అంతేకాదు విద్యార్థులను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ‘దిశ డైలీ న్యూస్’ కథనాలు ప్రకటించింది. ఈ కథనాలపై స్పందించిన బాలల హక్కుల కమిషన్ సుమోటా కేసుగా స్వీకరించింది. ఘటనపై విచారణకు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడిని కూడా సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే కేసుకు సంబంధించి మరో శాఖలో కూడా సస్పెన్షన్ల పర్వం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed