- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ పాలనలో దళితులకు తీరని నష్టం: Ms Raju
దిశ, ఏలూరు: రాష్ట్రంలో వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో దళితులకు తీరని నష్టం జరిగిందని, ముఖ్యంగా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితులపై దమనకాండకు నిరసనగా ఏలూరు టొబాకో కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన దళిత శంఖారావం సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపాలనలో దళితులపై కక్ష సాధింపులు, దాడులు, హత్యలు అధికమయ్యాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది ఉన్న దళితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారన్నారు. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి రానున్న ఎన్నికల్లో జగన్‌ని గద్దె దింపాలని కోరారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బడేటి చంటి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన సైకో జగన్ అధికారం చేపట్టాక ఆ విషయాన్ని విస్మరించారని మండిపడ్డారు.