Pawan Kalyan: వ్యక్తిగత విమర్శలపై ఆగ్రహం.. సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2023-06-30 15:05:42.0  )
Pawan Kalyan: వ్యక్తిగత విమర్శలపై ఆగ్రహం.. సీఎం జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: వ్యక్తిగత జీవితంపై మాట్లాడాలంటే తానూ మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న జగన్, వైసీపీ నేతల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. భీమవరం వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ జగన్ పర్సనల్ జీవితం మొత్తం చాలా చాలా డీటేల్డ్‌గా తెలుసన్నారు. కావాలంటే జగన్ మనిషిని పంపించాలని.. చెవుల్లో నుంచి రక్తం వస్తుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే తన వెంట్రుక కూడా ఊడదన్నారు. చిల్లర మాటలు మాట్లాడే వైసీపీ నేతల నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని పవన్ సూచించారు. పాలసీలపై మాట్లాడుతుంటే వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. ఫ్యాక్షన్, రౌడీ, క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని ఎగిరిపడుతున్నారని మండిపడ్డారు. తాను విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తినని, చాలా చాలా గట్టిగా పోరాటం ఉంటదని.. భయపడమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Advertisement

Next Story