- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ బస్సు ప్రమాదంపై విచారణ చేయిస్తాం: MLA Abbayya Chaudhary
దిశ, ఏలూరు: స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై రీ వెరిఫికేషన్ చేయిస్తామని దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి చెప్పారు. దెందులూరు మండలం వేగవరం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ప్రైవేటు స్కూల్ బస్సు ప్రమాదం తెలియగానే ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రతి విద్యార్థి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అబ్బాయ్య చౌదరి మాట్లాడుతూ వేగవరం వద్ద జరిగిన ప్రైవేటు స్కూలు బస్సు ఘటనపై కమిటీని నియమిస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై రీ వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. పక్కాగా ఫిట్నెస్ ఉన్న బస్సులను మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది విద్యార్థిని, విద్యార్థులు ఉన్నారని, వీరిలో 17 మందికి గాయలయ్యాయన్నారు. స్వల్ప గాయలైన 15 మందిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఏలూరులోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అయినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం కోరితే వారిని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.