ఏ.పి.ఎల్ చైర్మన్‌గా మాంచో ఫెర్రర్

by srinivas |
ఏ.పి.ఎల్ చైర్మన్‌గా మాంచో ఫెర్రర్
X

దిశ, ఏలూరు: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఛైర్మెన్‌గా మాంచో ఫెర్రర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జేశాప్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రామకృష్ణ రాజు, రాష్ట్ర కార్యదర్శి మొడియం ప్రసాద్, జిల్లా ప్రతినిధులు ఎంవీ గంగాధర రావు, బీవీ తారక రామారావు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో మాంచో ఫెర్రర్‌ను ఛైర్మన్ పదవికి ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్రంలో క్రికెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసి యువ క్రికెటర్‌లను ప్రోత్సహిస్తున్న ఫెర్రర్‌కు ఈ పదవి లభించడం శుభపరిణామని సీహెచ్ రామకృష్ణ రాజు పేర్కొన్నారు.

Advertisement

Next Story