Eluru: చెట్ల కింద చదువులు.. తీవ్ర ఆవేదనతో పవన్ ట్వీట్

by srinivas |   ( Updated:2023-07-10 14:09:53.0  )
Eluru: చెట్ల కింద చదువులు..  తీవ్ర ఆవేదనతో పవన్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందని వైసీపీ నేతలు ఊదర గొడుతున్నారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో చేసిన మార్పుల వల్లే విద్యార్థులు రాణిస్తున్నారని అంటున్నారు. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో జమానా కాలంలో విద్యార్థులు చెట్ల కింద చదువుకునే వాళ్లు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారుతున్న కొద్ది స్కూళ్లు, కాలేజీల భవనాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే కాలం ముందుకెళ్తుండటంతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు పెరిగిపోయాయి. దీంతో ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో చదవుతున్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలపైనే ఆధారపడి చదువుతున్నారు. అయితే వారు చదువుతున్న స్కూళ్లు, కాలేజీలకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలో కనీసం భవనాలు, తరగతి గదులు, బ్లాక్ బోర్డులు, బెంచీలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇందుకు నిదర్శనం ఏలూరు ప్రభుత్వ కళాశాల అని జనసేన అంటోంది. విద్యా, వైద్యం, ఉపాధి ఉంటేనే అభివృద్ధి చెందినట్లు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పష్టం చేశారు.


అయితే విద్యా, వైద్యం, ఉపాధిపైనే జనసేన పార్టీ దృష్టి పెట్టిందని చెప్పారు. అధికారంలోకి వస్తే ఈ విషయాల్లో తాను అండగా ఉంటామని పవన్ ప్రకటించారు. అయితే ఇంతలోనే పవన్ కల్యాణ్ చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. పవన్ కల్యాణ్ వారాహి రెండో విడత చేపట్టిన ఏలూరులోనే ఆయనకు ఓ దృశ్యం కనిపించింది. వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ దుస్థితిని పట్టించుకోని అధికారి పార్టీకి చురుకలు అంటించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులు చెట్ల కింద విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300 మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్.’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నారు. ఇక వైసీపీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Click here to read more articles about Pawan kalyan Varahi yatra

Advertisement

Next Story

Most Viewed