- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pawan Kalyan: భీమవరంలో ఓటమి తెలియదు.. ఓడిపోయినట్టు అనిపించడంలేదు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో తనకు ఓటమి తెలియలేదని, ఓడిపోయినట్టు అనిపించడంలేదన్నారు. తనకు ఓటమి.. గెలుపు ఉండవని.. ప్రయాణమే ఉంటుందని చెప్పారు. పదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. దళిత డైవర్‌ను వైసీపీ ఎమ్మెల్సీ చంపేస్తే స్పందనలేదని మండిపడ్డారు. మద్యపాన నిషేధమని చెప్పి మోసం చేస్తే స్పందనలేదని వ్యాఖ్యానించారు. 30 వేల మంది ఆడపడుచుల అదృశ్యమైనా స్పందన లేదన్నారు. వైసీపీ నడుపుతున్న దోపిడీ వ్యవస్థపై పోరాడుతున్నామన్నారు. యువత కోసం వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులుదులుపుకున్నారని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.