- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eluru: మహిళపై యాసిడ్ దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
దిశ:ఏలూరు ప్రతినిధి: ఏలూరులో మహిళపై దుండగులు యాసిడ్ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన ఫ్రాన్సిక భర్తతో మనస్పర్ధలు రావడంతో తండ్రి రాజు ఇంటి వద్దే ఉంటూ ప్రైవేటు వైద్యశాలలో రిసెప్షనిస్టుగా పని చేస్తున్నారు. అయితే ఆమె సోదరి సౌజన్యకు కూడా భర్తతో విబేధాలు రావడంతో పుట్టింట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సౌజన్యకు ఏలూరు వన్ టౌన్‌కు చెందిన బోడ నాగ సతీష్ ఎలియాస్ సాగర్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. దీంతో సౌజన్య కోసం సాగర్ తరచూ తమ ఇంటికి రావడాన్ని ఫ్రాన్సిక గమనించారు. తన చెల్లెలు జోలికి రావద్దని సాగర్‌ను ఫ్రాన్సిక మందలించింది. అది మనసులో పెట్టుకొని ఫ్రాన్సికపై మరో ఇద్దరితో కలిసి సాగర్ యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫ్రాన్సికకు తీవ్రగాయాలయ్యాయి. విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తు్న్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాక్ష్యాదారాలను సేకరించి 15 రోజుల్లో ఛార్జిషీటు వేస్తామని పోలీసులు తెలిపారు.