- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:వరద బాధితులకు ఏపీ ఎన్జీవోల విరాళం..ఎంతంటే?
దిశ, ఏలూరు:విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సేకరించిన 1,00,116 రూపాయల చెక్కును మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో ఉద్యోగుల సహకారం అభినందనీయమన్నారు సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక ప్రక్క జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చాక చక్యంగా బాధితులను ఆదుకోవడం, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తూ మరో ప్రక్క విజయవాడ నగరంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను, వాటర్ ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, తదితరాలను గత రెండు రోజులుగా జిల్లా నుంచి పంపడం అభినందనీయమన్నారు.