వరద బాధితుల సహాయార్థం విరాళం అందజేసిన అంబికా కృష్ణ

by Jakkula Mamatha |
వరద బాధితుల సహాయార్థం విరాళం అందజేసిన అంబికా కృష్ణ
X

దిశ, ఏలూరు:విజయవాడ వరద బాధితుల సహాయార్థం అంబికా దర్బార్ బత్తి సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ 5 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఐదు లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన గురువారం అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా మరో ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వారి అవసరాలు తీర్చేందుకు ప్రతి ఒక్కరు సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed