AP Rains:బలహీనపడిన వాయుగుండం..ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-21 15:28:29.0  )
AP Rains:బలహీనపడిన వాయుగుండం..ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండు రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్ని జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం బలహీనపడి కదులుతూ అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈక్రమంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు దిశగా కదులుతూ నేడు(ఆదివారం) మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఇవాళ మన్యం, అల్లూరి , కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read More..

Alluri District: వాగులో అత్యుత్సాహం.. రక్షించిన స్థానికులు

Advertisement

Next Story

Most Viewed