Chandrababu Nayudu : జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నాం : చంద్రబాబు

by M.Rajitha |
Chandrababu Nayudu : జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నాం : చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Nayudu) సంచలన ప్రకటన చేశారు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తున్న జమిలి ఎన్నికల(Jamili Elections) బిల్లుకు తాము మద్ధతు ఇస్తున్నట్టు ప్రకటించారు. జమిలి ఎన్నికల(One Nation One Election)ను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్డీఏ(NDA) ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపిన చంద్రబాబు.. దేశానికి మేలు జరిగే ఏ పనికైనా తమ మద్ధతు ఉంటుందని తెలియ జేశారు. 2047 నాటికి ఏపీ(AP)ని దేశంలో నెంబర్.1 గా నిలబెడతామని స్పష్టం చేశారు. సంపన్నమైన, సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన ఏపీ కోసం 10 సూత్రాలను అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed