- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandra Babu : రంకెలకు, పిచ్చి కుక్క కేకలకి భయపడం: అంబటి రాంబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్లపై రోడ్‌షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధంపై ఇటీవల విడుదల చేసిన జీవోపై వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా.. ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించినా జీవోను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా సరే జీవో ప్రకారంగానే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే రోడ్డుషోలు, ర్యాలీలు, సభలు నిర్వహించాలి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రంకెలకు, పిచ్చి కుక్క కేకలకి ఎట్టి పరిస్థితుల్లో జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవద్దని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
చంద్రబాబు కుప్పం పర్యటనకు రాకముందే జీవో తీసుకువచ్చారని అన్నారు. జీవో విడుదల అయినప్పటికీ చంద్రబాబు అనుమతి తీసుకుండా కుప్పం పర్యటనకు వెళ్లారని చెప్పుకొచ్చారు. జీవో అమలులో ఉందని పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా వారిపై వాగ్వాదానికి దిగడం దుర్మార్గమని అంబటి రాంబాబు అన్నారు. ఈ జీవోపై చంద్రబాబు, దత్త పుత్రుడు కొంత మంది ఎల్లో మీడియా వారు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. జీవో ప్రకారం ఏదైనా ఖాళీ స్థలాల్లో సభలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా చంద్రబాబుకి అర్థం కావడం లేదని విమర్శించారు.
అసలు ఈ జీవో తీసుకురావడానికి చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రంలో 11 మంది చనిపోయింది వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు అడుగుపెట్టిన చోట ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు అని చెప్పుకొచ్చారు. ప్రధాని పిలిచినా వెళ్లని చంద్రబాబు దుప్పట్లు పంచుతాను అంటే వెళ్లడం ఏంటి ...? అని నిలదీశారు. చింతపండు, దుప్పట్లు పంచితే కానీ ప్రజలు తెలుగుదేశం సభలకు రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ప్రజాదరణ కలిగిన ప్రభుత్వం కాబట్టే ప్రజలకు మంచి చేసే ఏపని అయినా సరే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో వెనుకాడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రోడ్ షోలను, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలనో ఆపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.