ఇండియా, ఎన్డీఏ కూటమికి మేం దూరం: విజయసాయిరెడ్డి

by Mahesh |
ఇండియా, ఎన్డీఏ కూటమికి మేం దూరం: విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ స్థాయిలో వైసీపీ(YCP) ఏ కూటమికి మద్దతు గా నిలుస్తుందనే ప్రశ్నలపై ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) క్లారిటీ ఇచ్చారు. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. వైసీపీ పార్టీ ఎన్డీయే(NDA) కూటమి తో సత్సంబంధాలు కొనసాగించింది. అయితే జనసేన రాకతో వైసీపీ పార్టీ ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కానీ ఆ పార్టీకి లోక్ సభ, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు. దీంతో ఆ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత.. ఇండియా(INDIA), ఎన్డీఏ(NDA) కూటమికి మేం దూరంగా ఉన్నామని.. తమకు ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు, మాది న్యూట్రల్ స్టాండ్ అని చెప్పుకొచ్చారు. అలాగే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మా పార్టీ అధ్యక్షుడ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అభిప్రాయమే చెబుతామని.. ప్రాంతీయ పార్టీగా ఏపీ ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యం అని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story