భారీ వర్షాల హెచ్చరికలు.. ముందస్తుగా పలు జిల్లాలకు సహాయ నిధులు విడుదల

by Mahesh |
భారీ వర్షాల హెచ్చరికలు.. ముందస్తుగా పలు జిల్లాలకు సహాయ నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనం(low pressure)గా మారింది. దీనికి తోడు తుఫాను కూడా ఉండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అల్పపీడనం కారణంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. ముందస్తు చర్యల్లో భాగంగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాలో వరద సహాయ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదల చేశారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, ఆహారం, హెల్త్ క్యాంపులు, రక్షిత తాగునీరు, శానిటేషన్ కోసం ఈ అత్యవసర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Next Story

Most Viewed