తుంగభద్ర దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు

by M.Rajitha |
తుంగభద్ర దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్ : తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రాజెక్టుకు మీది నుండి భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మరిన్ని గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదలనున్నట్టు అధికారులు ప్రకటించారు. అందువల్ల ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణమైనా నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు కాని, పశువులు మేపఎ వారు కాని ఎవరూ ప్రాజెక్టు దిగువ పరిసర ప్రాంతాలకు వెళ్లారాదని హెచ్చరించారు. కాగా ఇటీవలే భారీ వరద ప్రవాహం రావడం వలన ప్రాజెక్టులోని 19వ గేటు కొట్టుకు పోయిన సంగతి తెలిసిందే. నాలుగైదు రోజులు అధికారులు, కార్మికులు రాత్రింబవళ్ళు కష్టపడి తాత్కాలిక గేటును ఏర్పాటు చేశారు. మళ్ళీ తుంగభద్రకు వరద ప్రవాహం అధికంగా వస్తుండటంతో ఇటు ప్రాజెక్ట్ అధికారులు, అటు దిగువ ప్రాంతాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed