Cm Jagan: రూ.1000 కోట్లతో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం

by srinivas |   ( Updated:2022-12-30 11:43:07.0  )
Cm Jagan: రూ.1000 కోట్లతో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం
X

దిశ, ఉత్తరాంధ్ర: నర్సీపట్నాన్ని గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రూ.1000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.


విద్యపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ రాబోతుందన్నారు. కొత్త మెడికల్‌ కాలేజ్‌ కారణంగా 150 మెడికల్‌ సీట్లు వస్తాయన్నారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. 'రాజకీయం అంటే డైలాగులు కాదు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదు. రాజకీయం అంటే రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద, మధ్య తరగతి కుటుంబంలో మార్పులు తీసుకురావాలి.' అని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed