Narsipatnam: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుంచి టీడీపీ వాకౌట్

by srinivas |
Narsipatnam: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుంచి టీడీపీ వాకౌట్
X

దిశ, నర్సీపట్నం: నర్సీపట్నం ఇన్చార్జ్ మున్సిపల్ చైర్ పర్శన్ తమరాన అప్పలనాయుడు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే అధికారులు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ కౌన్సిలర్లు ఇదంతా దొంగ బడ్జెట్ అంటూ బయటకు వెళ్లిపోయి సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ మాట్లాడుతూ దొంగ బడ్జెట్ ప్రవేశపెట్టారని, అంకెలు అన్ని తప్పుడు తడకలుగా చూపించి మాయాజాలంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. ఈ బడ్జెట్‌ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.


అనంతరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య మాట్లాడుతూ మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పాలకవర్గం వైఖరి నిరసిస్తున్నామన్నారు. దీనిపై ఇన్చార్జ్ చైర్ పర్శన్ అప్పలనాయుడు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు పలువురు తమ వార్డుల్లోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed