- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salikamallavaram: పెద్ద తలకాలున్నాయా..?
దిశ, నర్సీపట్నం: గొలుగొండ మండలం సాలికమల్లవరం రంగు రాళ్ల క్వారీలో రాత్రి సమయంలో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగాయి. గతంలో కూడా ఇక్కడ ఇలాగే అక్రమ తవ్వకాలు జరిపి రంగు రాళ్లు కలిగి ఉన్న మట్టిని తరలించకు పోయారు. ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఏసీబీ లు ఏర్పాటు చేసి మరీ తవ్వకాలు జరిపారు. మూడు లారీల్లో రంగు రాళ్లు ఉన్న మట్టిని తాండవ రోడ్డు వైపు తరలించిపోయారని స్థానికులు అంటున్నారు. కోట్ల రూపాయల్లో రంగురాళ్లు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత బహిరంగంగా జేసీబీలు పెట్టి తవ్వకాలు జరిగామంటే దీని వెనుక పెద్ద తలకాయలు అండదండలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొద్ది నెలల క్రితం ఇదే మండలంలో ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రంగు రాళ్లు తవ్వకాలు జరిగాయి. ఇందులో ఈ తవ్వకాలపై కేసు పెట్టిన అధికారులు కొందరిని అరెస్టు చేశారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. కొందరు మీడియా ప్రతినిధుల పాత్ర ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలో రాజకీయ ఒత్తిడిలకు లొంగి , అక్రమ తవ్వకాల్లో పాత్ర ఉన్న మరికొందరిని వదిలేసారని ఆరోపణలు ఉన్నాయి.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో కోట్ల రూపాయల విలువైన రంగురాళ్లు లభ్యమవుతున్నాయి. కరక, పప్పు శెట్టి పాలెం, సాలికి మల్లవరం, ఆరిలోవ రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో ఎన్న కొండల్లో, పచ్చలు, క్యాట్స్ ఐ రకానికి చెందిన వైడూర్యాలు లభ్యమవుతున్నాయి. ఇక్కడ నిరంతరం ఏదో ఒక రూపంలో రంగురాళ్లు వేట కొనసాగుతూనే ఉంటుంది. అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి.
అయితే తాజాగా సాలికి మల్లవరంలో జరిగిన రంగు రాళ్లు అక్రమ తవ్వకాల వ్యవహారం మాత్రం అనేక అనుమానాలకు కలిగిస్తున్నది. రాత్రి సమయంలో సాలికమల్లవరం క్వారీలో అక్రమ తవ్వకాలు జరిగిన తీరును పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల జరిగిన సమయంలో మూడు రోజులుగా సంబంధిత అధికారులు సెలవులపై వెళ్లిపోవడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత పగడ్బందీగా తవ్వకాలు జరిగాయి అంటే, దీని వెనక రాజకీయ అండదండలు కూడా ఉండి ఉంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.