- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: నర్సీపట్నంలో భారీ వర్షం.. రోడ్ల నిండా నీళ్లే...!
X
దిశ, నర్సీపట్నం: ఉమ్మడి విజయనగరం జిల్లా నర్సీపట్నం డివిజన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం విరుచుకుపండింది. కేడీపేట- నర్సీపట్నం రోడ్డు మార్గంలో భారీ చెట్టు విరిగి పడింది. దీంతో రోడ్డుపై వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. నర్సీపట్నం, గొలుగొండలో 6 నెలల తరువాత వర్షం దంచికొట్టింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లే శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపించడంతో వేసవి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షానికి సేద తీరారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల జీడిమామిడి తోటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story