- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cm Jagan అనకాపల్లి జిల్లా పర్యటన షెడ్యూలు ఖరారు
దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం జగన్ ఈనెల 28న క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరతారు. 9.30 గంటలకు విమానంలో గన్నవరం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. 10.20గంటలకు విశాఖ విమానాశ్రయంలో దిగుతారు. 10.25గంటలకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టానికి హెలీకాఫ్టర్‌లో వెళ్తారు. 10.40 గంటలకు దిగి..పావుగంట పాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. 11.15గంటలకు నర్సీపట్నం మండలం జోగినాథపాలెంకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. 11.20కి నర్సీపట్నం మెడికల్ కళాశాల పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.25గంటలకు ఏలేరు`తాండవ కెనాల్ లింక్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 11.35గంటలకు వివిధ కార్యక్రమాల అనంతరం 12గంటలకు బహిరంగ సభనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడతారు. 12.50కు బయల్దేరి 1.05గంటలకు రోడ్డు మార్గంలో బలిగట్టం చేరుకుంటారు. అనంతరం కొద్దిసేపు స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. 1.25గంటలకు హెలీకాఫ్టర్‌లో విశాఖ బయల్దేరతారు. 1.40గంటలకు విశాఖ చేరుకుని అనంతరం విమానంలో గన్నవరం బయల్దేరతారు. 2.40గంటలకు గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 3.05గంటలకు సీఎం జగన్ తన ఇంటికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందగా, ఏర్పాట్లు చేపట్టారు.