- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు.. !
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికలు రేపు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేలా ప్రజలకు మంచి పనులు చేస్తున్నామని రాజన్న దొర పేర్కొన్నారు.
ఇక రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారానికి ఊపందించాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అటు సీఎం జగన్ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చెప్పారని పలువురు వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం రాజన్న దొర కూడా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో వైపు ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని మరికొంతమంది వైసీపీ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.