Anakapalli: వైసీపీలో చేరిన 150 మంది టీడీపీ కార్యకర్తలు

by srinivas |   ( Updated:2023-03-08 10:49:45.0  )
Anakapalli: వైసీపీలో చేరిన 150 మంది టీడీపీ కార్యకర్తలు
X

దిశ, దేవరాపల్లి: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన 150 మంది టీడీపీ కార్యకర్తలు లాలం జానకి రామ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీకి చెందిన పరివాడ కోటి, సూర్ల నాగేష్, ముర్రు కొండబాబు, సోలా లక్ష్మణ, సుర్ల రామనాయుడు, చుక్కాకుల నాగలక్ష్మి, కాశిరెడ్డి స్వామి తదితరులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ముత్యాలనాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అందరూ ఓకే కుటుంబ సభ్యులుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజబాబు, యూత్ అద్యక్షులు స్వామి నాయుడు, కన్వీనర్ చైతన్య, మాజీ ఎంపిపి అచ్చిబాబు, మాజీ సర్పంచ్ చొక్కాకుల కోటి, గృహ సారథి ముర్రుకోటి, జగ్గునాయుడు, కూరాకుల అరుణ్ కుమార్, సుర్లా అప్పలనాయుడు, సింహాచలం నాయుడు, ముర్రు కోటి, పి.నారాయణమూర్తి, బి.అప్పలనాయుడు, చొక్కాకుల వెంకునాయుడు, దేముడు, బుసర నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story