- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే రంగా హత్య కేసు రీ ఓపెన్ చేయించాలి: ఎమ్మెల్యే వెలగపూడి
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో వేల కోట్ల భూములను కబ్జా చేసిన భూ భక్షకుడు, ల్యాండ్ మాఫియా డాన్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అని విశాఖ తూర్పు నియోజక వర్గ శానసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ధ్వజమెత్తారు. పలువురు బీసీ నేతలతో కలసి శనివారం ఉయదం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎంవీవీ భూ కబ్ఝాలకు పాల్పడ్డారని, స్వయంగా అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. భవన నిర్మాణదారు 99 శాతం వాటా తీసుకొని భూ యజమానికి ఒకశాతం వాటా ఇవ్వడం కుంభకోణం కాదా అని విజయసాయి ఎంవీవీని ఉద్దేశించి ప్రశ్నించిన మాట నిజం కాదా అని నిలదీశారు. తన భవనాలకు అనుమతులు వెంటనే రానప్పడు విశాఖలో వ్యాపారం చేయలేనని, ఇక హైదరాబాద్ వెళుతున్నానని ఎంవీవీ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఎంవీవీకి వైసీపీ అధిష్టానం అసెంబ్లీ సీటు ఇవ్వడం కేవలం డబ్బు కోసమేనని విమర్శించారు.
దమ్ముంటే రంగా హత్య కేసు రీ ఓపెన్ చేయించు
తనపై హత్య కేసు ఉందని ఎంవీవీ ఆరోపించడాన్ని వెలగపూడి తప్పు పట్టారు. అది ఎప్పుడో క్లోజ్ అయిందని, ఎంవీవీకి దమ్ముంటే ఆ కేసును రీ ఓపెన్ చేయించాలని సవాల్ విసిరారు. తనపై హత్య కేసు ఉందంటూ ఎంవీవీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ సమయం నుంచే యాదవులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని, యాదవ నేత వంశీకృష్ణను కలిస్తే ఎంవీవీ ఎందుకు బాధ పడుతున్నారని ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో తనపై కల్తీ కేసులు లేవని, ఎంవీవీ పైనే చాలా కేసులు ఉన్నాయని వెలగపూడి ఆరోపించారు